పెళ్లైన 14 రోజులకే ప్రియుడి కోసం.. అడ్డువస్తే వరకట్నం కేసు పెడతామని భర్తకు వధువు బెదిరింపులు

ఘజియాబాద్: వివాహేతర సంబంధాల మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు సమాజంలో ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ నవ వధువు పెళ్లైన రెండు వారాలకే ప్రియుడి కోసం భర్తను వదిలేసి వెళ్లిపోయింది. తన వ్యవహారానికి అడ్డువస్తే గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెడతామంటూ భర్తను బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని కౌశాంబి ప్రాంతానికి చెందిన అభినవ్‌ ఖండేల్‌వాల్‌కు, రాణి అనే యువతితో జులై 11న వివాహం జరిగింది. పెళ్లైన వారం రోజులకే రాణి తరచూ ఫోన్‌లో వేరే వ్యక్తితో మాట్లాడుతుండటాన్ని అభినవ్‌ గమనించాడు. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీయగా, తన ప్రియుడితోనే అని ఆమె ఏమాత్రం బెరుకు...