ఢిల్లీ నుంచే ఓట్ల గల్లంతు: ఈసీ తీరుపై 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సంచలన కథనం

గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఓట్ల గల్లంతు, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రిక వరుస పరిశోధనాత్మక కథనాలను వెలువరిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI)లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, తోటి కమిషనర్లను సైతం లెక్కచేయడం లేదని గతంలో కథనం ప్రచురించిన ఆ పత్రిక, తాజాగా రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచే ఐటీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు ఎలా జరిగిపోతున్నాయో ఆధారాలతో సహా బయటపెట్టింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, తోటి కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కిందిస్థాయి అధికారుల అధికారాలను లాగేసుకుని ఈసీ ఐటీ విభాగం ఏకపక్షంగా ఎలా వ్యవహరించిందో...