బాలాపూర్ గణనాథుని లడ్డూకు రికార్డు ధర.. రూ.39 లక్షలకు దక్కించుకున్న ప్రణీత్ రెడ్డి
హైదరాబాద్: భాగ్యనగరంలో ఎంతో విశిష్టత కలిగిన బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ఏడాది 21 కిలోల బాలాపూర్ గణేశుడి మహా ప్రసాదాన్ని (లడ్డూ) అర్బన్ గ్రూప్‌కు చెందిన సామా ప్రణీత్ రెడ్డి రూ. 39 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ లడ్డూ ధర రూ.35 లక్షలు పలకగా, ఈసారి ఏకంగా మరో రూ.4 లక్షలు అదనంగా పలకడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక వేలం పాటలో ఈ ఏడాది మొత్తం 9 మంది పోటీ పడగా, అందులో ఐదు కార్పొరేట్ సంస్థలు ఉండటం గమనార్హం. కేవలం ఈ లడ్డూ వేలంలో పాల్గొనేందుకు ఎన్ఆర్ఐలు సైతం విదేశాల నుంచి...