కూటమిలో చీలిక లేదు.. ఒంటరి పోరు వార్తలపై జనసేన శ్రేణుల ఆగ్రహం

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలవుతున్న వేళ, రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) మధ్య సీట్ల సర్దుబాటు, పొత్తులపై సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని, కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, వాస్తవాలకు విరుద్ధంగా తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై మండిపడుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ విపక్ష వైసీపీకి అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో కూటమి పక్షాలు బలంగా అడుగులు...