ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి: వైఎస్ జగన్ డిమాండ్

అమరావతి: దేశంలో ఎన్నికల ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల సవరణ, ఈసీఐ-నెట్ నిర్వహణ తదితర కీలక అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పదేపదే లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. పరస్పర ఆరోపణల కంటే, కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు ఏమిటి, వాటిపై తీసుకున్న చర్యలు ఏమిటన్నది బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియలో పారదర్శకత ఎంతవరకు పాటించారనే దానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కేవలం...