యూపీఐ లావాదేవీలపై కస్టమర్లకు నో ఛార్జ్.. అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ యూపీఐ (UPI) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. వ్యాపార లావాదేవీలపై విధించే ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీల భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కస్టమర్లపై మోపబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రూ.2,000 కు మించిన కొన్ని నిర్దిష్ట యూపీఐ వ్యాపార లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని, ఆ రుసుము కేవలం చెల్లింపు వ్యవస్థలోని వ్యాపారులు, సంబంధిత బ్యాంకుల మధ్యే సర్దుబాటు అవుతుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త ఎండీఆర్ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, సామాన్య వినియోగదారుల్లో తలెత్తిన ఆందోళనలను తొలగిస్తూ కేంద్రం ఈ మేరకు...