గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
ముఖ్యమైన పాయింట్స్:కన్నుల పండువగా ముగిసిన 69 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనంఅశ్రునయనాలతో వీడ్కోలు పలికిన వేలాది మంది భక్తులు హైదరాబాద్: నవరాత్రుల పాటు విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కన్నులపండువగా ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తుతో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు కనువిందు చేసిన గణనాథుడు.. శుక్రవారం వేలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య హుస్సేన్‌సాగర్‌లో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ మహా శోభాయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మిక కోలాహలంతో, ఉత్సాహభరితంగా సాగింది. యాత్ర ఆరంభంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వినాయకుడి ఎదుట ఉత్సాహంగా నృత్యం చేస్తూ భక్తుల్లో మరింత జోష్ నింపారు....