భారత బ్యాటర్ల విధ్వంసం.. ఆసీస్‌పై సంచలన విజయంతో సిరీస్ కైవసం
ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో ఇండియా-ఎ మహిళల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 363 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు అలవోకగా ఛేదించి రికార్డు సృష్టించారు. కష్టసాధ్యమనుకున్న టార్గెట్‌ను కేవలం 48.2 ఓవర్లలోనే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించి సగర్వంగా తలెత్తుకున్నారు. ఈ చారిత్రక విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని సత్తా చాటింది. బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నా.. బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కి అద్భుత విజయాన్ని అందించారు. భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా మిన్నూ మాని కేవలం...