సీఈసీ నియామకంపై జగన్ ట్వీట్.. మహువా మోయిత్రా స్ట్రాంగ్ కౌంటర్
ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఉండాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ట్వీట్‌పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఈసీ నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపిందని, ఇప్పుడు ఆదే పార్టీ అధినేత నీతులు చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ముందుగా పార్లమెంట్లో బీజేపీకి మద్దతు ఇవ్వడం ఆపాలని, రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియను వైఎస్సార్సీపీ ఎంపీలు...