జెన్‌జీ జేబులో మన్మోహన్: 1991 ఆర్థిక సంస్కరణల నుంచి నేటి ఉద్యోగాల దాకా..

స్టార్టప్‌ల స్థాపన నుంచి బహుళజాతి కంపెనీల్లో కొలువుల వరకు.. మూడు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన ప్రగతి వెనుక మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలోచనల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న 1991 కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే నేటి నవ భారతానికి పునాదులు వేశాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి, రోజువారీ అవసరాలకు కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేశారు. దిగుమతులు, పెట్టుబడులు, పరిశ్రమలపై ఉన్న ఆంక్షలను సడలించి.. సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం...