పెట్రోల్ అవసరం లేదు.. లీటరుకు రూ. 25 ఖర్చుతోనే నడిచే 100% ఇథనాల్ టయోటా ఇన్నోవా!

న్యూఢిల్లీ: ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. త్వరలోనే దేశీయ మార్కెట్లోకి 100 శాతం ఇథనాల్‌తో నడిచే టయోటా ఇన్నోవా కారు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వాహనానికి పెట్రోల్ అవసరం ఏమాత్రం ఉండదని, దీని నిర్వహణ ఖర్చు లీటరు పెట్రోల్ రూ.25కి లభిస్తే ఎంత అవుతుందో దానికి సమానంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గడ్కరీ ఈ సరికొత్త ఇన్నోవా విశేషాలను పంచుకున్నారు. అక్టోబర్‌లో జరగనున్న ఈ కారు ప్రారంభోత్సవానికి...