డీఎస్సీపై సీబీఐ విచారణకు మేము సిద్ధం.. అక్రమాస్తుల కేసుల దర్యాప్తును అంగీకరించే దమ్ము జగన్‌కు ఉందా?

అమరావతి: డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి సీబీఐ విచారణకైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసులు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వెల్లడించిన వాస్తవాలను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ నివేదికలు, దర్యాప్తు అంశాలను జగన్ నిజమేనని ఒప్పుకున్న మరుక్షణమే.. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను ఒప్పిస్తానని సోమిరెడ్డి సవాల్ విసిరారు....