ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా సన్నాహాలు?

ముఖ్యమైన పాయింట్స్:7 రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తామన్న టెహ్రాన్ ప్రతిపాదనపై నీలినీడలు వాషింగ్టన్/టెహ్రాన్: నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై అమెరికా మళ్లీ వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన సహాయకులతో ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. మరోవైపు, అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, అణు కార్యక్రమంపై చర్చలకు సిద్ధమని ఇరాన్ ఓ కీలక ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఈ శాంతి...