విండీస్‌తో తొలి వన్డే: నాలుగో స్థానంలో జైస్వాల్!
ముఖ్యమైన పాయింట్స్:తుది జట్టు అంచనాలను పంచుకున్న మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. శ్రేయస్ గైర్హాజరీలో మిడిలార్డర్లో ప్రయోగాలకు సూచన తిరువనంతపురం: వెస్టిండీస్‌తో జరుగనున్న తొలి వన్డే కోసం భారత జట్టు ఇప్పటికే తిరువనంతపురం చేరుకుని ముమ్మర సాధన ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో బరిలోకి దిగే భారత తుది జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్‌గా స్థిరపడిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను ఈ సిరీస్‌లో నాలుగో స్థానంలో ఆడించాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా కైఫ్ మాట్లాడుతూ.. "ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రావడం దాదాపు...