మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త

టెలికాం వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ప్రస్తుతం చాలా టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. దీని వల్ల నెలకు ఒకసారి చొప్పున రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఏడాదికి 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు, ప్రత్యామ్నాయంగా పూర్తి నెల (30 రోజులు) వ్యాలిడిటీ ఆప్షన్లను తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) టెలికాం సంస్థలను ఆదేశించింది. కొత్త ఫోన్ కొంటే.. ఆరు నెలల జియో రీచార్జ్ ఫ్రీ! కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో 10వ వార్షికోత్సవం...