బ్యాంకుల సమ్మె వాయిదా.. కస్టమర్లకు భారీ ఊరట!
ముఖ్యమైన పాయింట్స్:ఐబీఏతో సఫలమైన చర్చలు.. అక్టోబర్ 2న మొబైల్ రిటైలర్ల ‘నో యూపీఐ డే’ దేశవ్యాప్తంగా మూడ్రోజుల పాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. సమ్మె వార్తలతో తీవ్ర ఆందోళన చెందిన సామాన్య ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఇది పెద్ద ఊరటనిచ్చింది. ఈ నెల 28 నుంచి 30 వరకు తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు సఫలం కావడంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు యథాతథంగా సేవలు అందిస్తున్నాయి. ఫలించిన అర్ధరాత్రి భేటీ.. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్...