అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’.. ఎండీఆర్ ఛార్జీలపై రిటైలర్ల సమరం!
ముఖ్యమైన పాయింట్స్:క్యూఆర్ కోడ్లపై నల్లగుడ్డ కప్పి నిరసన.. క్యాష్, కార్డుల ద్వారానే పేమెంట్లు యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (MDR) ఛార్జీల విధింపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా మొబైల్ రిటైలర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ‘నో యూపీఐ డే’ నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ - AIMRA) ప్రకటించింది. రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదన చిన్న, మధ్య తరహా వ్యాపారుల నడ్డి విరుస్తుందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిరసనలో భాగంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా వేలాది మొబైల్ షాపుల్లోని క్యూఆర్ కోడ్ స్టాండ్లను నల్లటి గుడ్డతో కప్పివేయనున్నారు. ఆ...