టెలికాం కస్టమర్లకు ట్రాయ్ భారీ ఊరట!
ముఖ్యమైన పాయింట్స్:ఇకపై ‘వాయిస్, ఎస్ఎంఎస్’ ప్లాన్లు.. 28 రోజుల రీఛార్జ్ సైకిల్‌కు చెక్ టెలికాం రంగంలో వినియోగదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సంచలన నిర్ణయం తీసుకుంది. డేటా అవసరం లేకపోయినా బలవంతంగా ఇంటర్నెట్ ప్యాక్‌లను అంటగడుతున్న టెలికాం కంపెనీల వ్యాపార ధోరణికి చెక్ పెడుతూ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకొచ్చింది. డేటా వద్దు.. కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్లు ముద్దు.. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) వంటి సంస్థలు అందిస్తున్న దాదాపు అన్ని ప్లాన్లలో ఇంటర్నెట్ డేటా తప్పనిసరిగా ఉంటోంది. కేవలం మాట్లాడుకోవడానికి లేదా సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి మాత్రమే ఫోన్...