పెండింగ్ చలాన్లకు కరెంట్ బిల్లుల లింక్!

ముఖ్యమైన పాయింట్స్:జరిమానాలు కట్టకపోతే లైసెన్స్, ఆర్‌సీ రెన్యువల్ బ్రేక్.. చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, జరిమానాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేస్తే సరిపోదని, పెండింగ్ జరిమానాలను వసూలు చేసేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, ఆ బకాయిలను కరెంటు బిల్లులతో పాటు ఇతర ప్రభుత్వ బిల్లులకు లింక్ చేసి వసూలు చేసే మార్గాలను అన్వేషించాలని జస్టిస్ జె.బి.పార్దీవాలా సంచలన సూచన చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు రూ.45,000 కోట్ల మేర ఈ-చలాన్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా,...