టెంకాయలు కొట్టి వదిలేయం.. గుమ్మడికాయ కొట్టి తీరుతాం!

ముఖ్యమైన పాయింట్స్:బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి రూ.58 కోట్లు ఖర్చు.. రానున్న ఎన్నికల్లో 28 వార్డుల్లోనూ కూటమి గెలవాలి: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల పట్ల తీవ్ర వివక్ష చూపారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా అన్ని వార్డుల్లోనూ సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతోందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14, 15, 18వ వార్డుల్లో సుమారు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురుగునీటి డ్రైన్ల నిర్మాణ పనులకు శనివారం స్థానిక నాయకులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలను...