ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ!

ముఖ్యమైన పాయింట్స్:ముందస్తు ప్రణాళికతో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నగదు.. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన), ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. పింఛన్ల పంపిణీ సమయాల్లో మార్పులు జరిగినట్లు వచ్చిన వదంతులను ఆయన కొట్టిపారేశారు. ఎప్పటిలాగే తెల్లవారుజాము నుంచే సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా నగదు అందజేస్తారని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమణతో రాష్ట్రంలో బ్యాంకింగ్‌ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేదని,...