ఓటరు జాబితా సవరణ: తెలంగాణలో 92 లక్షల మందికి నోటీసులు

ముఖ్యమైన పాయింట్స్:45 లక్షల మందికి పైగా ఓటర్లకు అర్హత నిర్ధారణ.. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92 లక్షల మందికి పైగా ఓటర్లకు విచారణ నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి వెల్లడించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన తాజా వివరాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92,88,180 నోటీసులను జనరేట్ చేయగా, వాటిలో 87,85,739 మందికి అధికారులు...