పట్టాలపై నెత్తురోడిన మూగజీవాలు
ముఖ్యమైన పాయింట్స్:రైలు ఢీకొని 100కు పైగా గొర్రెల మృతి- ఘట్‌కేసర్ సమీపంలో తెల్లవారుజామున ఘటన- కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కాపరులు ఘట్‌కేసర్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొనడంతో 100కు పైగా గొర్రెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన ఔషాపూర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన కాపరులు తమ గొర్రెల మందతో కేపాల్ వద్ద రైల్వే పట్టాల సమీపంలో బస చేశారు. కాపరులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో, అటుగా వస్తున్న రైలు భారీ శబ్దానికి గొర్రెలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి....