తిరుమలలో అక్టోపస్ బలగాల మాక్ డ్రిల్

ముఖ్యమైన పాయింట్స్:శ్రీకృష్ణ గెస్ట్ హౌస్‌లో ఉగ్రదాడిని ఎదుర్కొనేలా విన్యాసాలు- భక్తుల భద్రతే లక్ష్యంగా పోలీసు, టీటీడీ విభాగాల సన్నద్ధత తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా తిరుమలలో అక్టోపస్ (OCTOPUS) బలగాలు మంగళవారం భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. శ్రీకృష్ణ గెస్ట్ హౌస్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా ఓ నమూనా పరిస్థితిని సృష్టించి, ఆ అత్యవసర సమయాన్ని భద్రతా బలగాలు ఎలా దీటుగా ఎదుర్కోవాలనే దానిపై కమాండోలు విన్యాసాలు చేపట్టారు. తిరుమల అదనపు ఎస్పీ ఐ. రామకృష్ణ, టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మాక్ డ్రిల్...