పునాది గుంతలో మృత్యుఘోష

ముఖ్యమైన పాయింట్స్:నిర్మాణ స్థలంలో కుప్పకూలిన జేసీబీ, క్రేన్- సైట్ ఇంజనీర్ సహా ముగ్గురి దుర్మరణం- మరో ముగ్గురికి తీవ్ర గాయాలు- తిరుపతి 'నంది గ్రూప్ ఆఫ్ హోటల్స్' సైట్‌లో ఘోర ప్రమాదం- ఘటనా స్థలాన్ని పరిశీలించిన కమిషనర్ జయకృష్ణ తిరుపతి: నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవన స్థలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పునాదుల కోసం తీసిన భారీ గుంతలోకి అకస్మాత్తుగా జేసీబీ, క్రేన్ విరిగిపడటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీ కన్వెన్షన్ పక్కనే ఉన్న స్థలంలో 'నంది గ్రూప్ ఆఫ్ హోటల్స్' ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా సుమారు 30 అడుగుల లోతులో...