శంషాబాద్ నుంచి తాష్కెంట్‌కు నేరుగా విమాన సర్వీసులు..
దక్షిణ భారతదేశాన్ని మధ్య ఆసియాతో కలుపుతూ తొలిసారిగా నేరుగా విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు ‘సెంట్రమ్ ఎయిర్’ సంస్థ మంగళవారం తమ తొలి సర్వీసును లాంఛనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీహెచ్ఐఏఎల్, సెంట్రమ్ ఎయిర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ డైరెక్ట్ విమాన సర్వీసులు వారానికి రెండుసార్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి సోమవారం, గురువారం రాత్రి 9:30 గంటలకు తాష్కెంట్లో బయలుదేరే విమానం మరుసటి రోజు తెల్లవారుజామున 2:20 గంటలకు శంషాబాద్ చేరుకుంటుంది. తిరిగి ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో తెల్లవారుజామున 3:35 గంటలకు శంషాబాద్‌లో బయలుదేరి ఉదయం 7:45...