అక్టోబర్ నుంచి 1.58 కోట్ల రేషన్ కార్డుల నిలిపివేత.. ఈ-కేవైసీకి మూడు నెలల గడువు

ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల రేషన్ కార్డులను అక్టోబర్ నెల నుంచి తాత్కాలికంగా నిలిపివేసేందుకు సిద్ధమైంది. నకిలీ, డూప్లికేట్ కార్డులతో పాటు మరణించిన వ్యక్తుల పేర్లను తొలగించి, నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ సాయం అందాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఆధార్ అనుసంధానం, డిజిటలైజేషన్, ఈ-కేవైసీ వంటి విధానాల ద్వారా పీడీఎస్ (PDS) డేటాబేస్‌ను ప్రక్షాళన చేసే పనిని ప్రభుత్వం ముమ్మరం చేసింది. అయితే, లబ్ధిదారుల పేర్లను ప్రభుత్వం డేటాబేస్ నుంచి వెంటనే శాశ్వతంగా తొలగించదు. వారు నిజమైన...