మేము చమురు అమ్మకపోతే.. ప్రాంతంలో ఎవరినీ అమ్మనివ్వం!
ముఖ్యమైన పాయింట్స్:అమెరికాకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్ తీవ్ర హెచ్చరిక- 1980ల నాటి వ్యూహాలతోనే అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటామని స్పష్టీకరణ- ఒకవైపు వార్నింగ్లు.. మరోవైపు ఖతార్లో ఇరు దేశాల రహస్య చర్చలు- ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తమ భద్రతకు విఘాతం కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాను హెచ్చరించింది. తమ చమురు ఎగుమతులను అడ్డుకుంటే, ఆ ప్రాంతంలోని ఏ ఒక్క మౌలిక సదుపాయం కూడా సురక్షితంగా ఉండబోదని స్పష్టం చేసింది. "మేము చమురు అమ్మలేని పరిస్థితి వస్తే.. ఈ ప్రాంతం నుంచి మరెవ్వరినీ చమురు అమ్మనివ్వబోం" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలీబాఫ్...