తప్పులు దాచేందుకు డబ్బులివ్వడం లంచమే!

ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి.. లేదంటే ప్రజల తిరుగుబాటే- విశాఖలో పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకునే బాధ్యత పవన్ కల్యాణ్‌దే- కొండల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి- ఎమ్మెల్యే వంశీకి ఇంకా జనసేన సిద్ధాంతాలు వంటపట్టలేదు- బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు విశాఖపట్నం: ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వడం ఒక రకంగా లంచం కిందే లెక్కని పర్యావరణవేత్త, జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో జరిగే తప్పొప్పులు రెండింటినీ ధైర్యంగా చెప్పే వారికే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. కేవలం మంచిని మాత్రమే ప్రచారం చేస్తూ, చెడును దాచిపెడితే భవిష్యత్తులో ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటు రావడం ఖాయమని ఆయన...