గాల్లో హైజాక్ కలకలం: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ల మధ్య కత్తిపోట్లు!

ముఖ్యమైన పాయింట్స్:దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో అనూహ్య ఘటనఎమర్జెన్సీ కోడ్స్ జారీ.. రంగంలోకి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలుసౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయిన విమానంఅందరూ సురక్షితం.. హైజాక్ కాదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ పీఎంవో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో ఊహించని పరిణామాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. సుమారు 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో మధ్యంతరంగా పైలట్ల మధ్య వివాదం తలెత్తి, ఏకంగా కత్తితో దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ విమానం అత్యవసర కోడ్‌లను జారీ చేయగా, అప్రమత్తమైన అధికారులు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్...