ఈసీఐఎల్‌లో 'హిట్ అండ్ రన్'.. 10 మందిపైకి దూసుకెళ్లిన కారు

ముఖ్యమైన పాయింట్స్:అర్ధరాత్రి దారుణం.. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన డ్రైవర్బీహార్‌కు చెందిన వలస కార్మికులపైకి దూసుకెళ్లిన వైనంముగ్గురికి తీవ్ర గాయాలు.. సీసీటీవీలో ఒళ్లు జలదరించే దృశ్యాలుకేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఈసీఐఎల్ (హైదరాబాద్): నగరంలోని ఈసీఐఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపై ఓ కారు డ్రైవర్ మృత్యువులా విరుచుకుపడ్డాడు. అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపి ఏకంగా పది మందిని ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును ఆపకుండా అక్కడినుంచి పరారయ్యాడు. ఈ 'హిట్ అండ్ రన్' ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్...