మియాపూర్ హోటల్లో లేడీ డాక్టర్ దారుణ మృతి
ముఖ్యమైన పాయింట్స్:మాజీ ప్రియుడిపై అనుమానాలు!హనుమకొండలో పీజీ చదువుతున్న సృజన..ప్రియుడు రవికుమార్ కోసం పోలీసుల ముమ్మర గాలింపు హైదరాబాద్ (మియాపూర్): రాజధాని నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో 27 ఏళ్ల మహిళా వైద్యురాలి మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన Dr Komati Srijana హనుమకొండలో PG Pediatrics మొదటి సంవత్సరం చదువుతున్నారు. సెప్టెంబర్ 30న హైదరాబాద్కు వచ్చిన ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు మొబైల్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా గాలించిన పోలీసులు, మియాపూర్లోని ఓ హోటల్లోని 502వ గదిలో సృజన మృతదేహాన్ని గుర్తించారు. ఈ...