సీలింగ్ భూములపై సర్కార్ ఫోకస్.. త్వరలో భారీగా మిగులు భూముల గుర్తింపు!
ముఖ్యమైన పాయింట్స్:అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ స్పష్టత.. పాత రికార్డుల స్క్రూటినీతో భూయజమానులు, రియల్టర్లలో కలకలం హైదరాబాద్ : రాష్ట్రంలో పాత భూ రికార్డులను, ప్రస్తుత డిజిటల్ వివరాలతో సరిపోల్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భారీ ఎత్తున మిగులు భూములు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో Land Ceiling Act రద్దయిందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ, చట్టం ఇప్పటికీ పకడ్బందీగా అమల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. పరిమితికి మించి భూములు ఉన్నట్లు తేలితే ప్రభుత్వం వాటిని తక్షణమే స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ గణాంకాల...