ఒకే పాస్తో బస్సు, మెట్రో ప్రయాణం: నగరవాసులకు శుభవార్త!
ముఖ్యమైన పాయింట్స్:ప్రజాభవన్లో ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ సర్వీస్ ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం.. త్వరలో ఆటోలకూ విస్తరణ: సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించి, ట్రాఫిక్ చిక్కులకు స్వస్తి పలికే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగర ప్రయాణికుల ఇబ్బందులు, రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లకు వర్తించే Hyderabad Metro and TGSRTC Common Pass విధానాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. ప్రజాభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం...