ఏషియన్ గేమ్స్ 2026: 85 పతకాలతో ముగిసిన భారత్ పోరు.. ఆందోళనలో టాప్-4 స్థానం!
జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పోటీల్లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. 15వ రోజు పోటీలు పూర్తయ్యేసరికి భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో మొత్తంగా 85 పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టిక (Asian Games 2026 Medal Tally) లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ఈ స్థానం ఎంతవరకు నిలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఐదో స్థానంలో ఉన్న ఉజ్బెకిస్తాన్ కూడా 21 స్వర్ణాలతో భారత్‌కు పోటీగా ఉంది. ఆఖరి రోజున జరిగే ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో ఉజ్బెకిస్తాన్ స్వర్ణం గెలిస్తే, భారత్‌ను ఐదో స్థానానికి నెట్టి టాప్-4లో నిలుస్తుంది. 2022 చైనా ఏషియన్ గేమ్స్‌తో పోలిస్తే ఈసారి...