మద్యం వినియోగంలో తెలంగాణే 'టాప్'..
ముఖ్యమైన పాయింట్స్:బెల్ట్ షాపులు ఎత్తేయండి: సీఎం రేవంత్‌కు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి హైదరాబాద్: దేశంలోనే అత్యధిక మద్యం వినియోగం నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటంతో కుటుంబ వ్యవస్థలు, ప్రజారోగ్యం దెబ్బతింటున్నాయని 'ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్' (FGG) పేర్కొంది. గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎఫ్‌జీజీ ప్రతినిధులు ఒక వినతిపత్రం సమర్పించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలను ఉటంకిస్తూ తెలంగాణలో మద్యం వాడకం ప్రమాదకర స్థాయికి చేరిందని ఎఫ్‌జీజీ స్పష్టం చేసింది (Telangana Alcohol Consumption). రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని...