దసరా వేళ సామాన్యుడికి 'నయారా' షాక్: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు!
పండుగ సీజన్లో సామాన్యులపై ధరల భారం మరింత పెరిగింది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన 'నయారా ఎనర్జీ' పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు శనివారం నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నయారా నిర్వహిస్తున్న 7 వేలకు పైగా రిటైల్ అవుట్లెట్లలో ఈ పెరిగిన ధరలు (Nayara Energy Fuel Prices) వర్తిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో కంపెనీ మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని, అందుకే ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ తన ప్రకటనలో వివరించింది. ఈ...