చైనా 'PL-15E' క్షిపణి రహస్యాలపై భారత్ రివర్స్ ఇంజనీరింగ్.. డేటా కోసం ఫ్రాన్స్, జపాన్ ఆసక్తి!
న్యూఢిల్లీ/హోషియార్పూర్: ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్‌లోని హోషియార్పూర్ సమీపంలో కూలిపోయిన చైనా తయారీ 'PL-15E' సుదూర శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి సాంకేతికతపై భారత రక్షణ రంగ నిపుణులు కీలక పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్షిపణి పనితీరు, దానిలో వాడిన ఆధునిక పరిజ్ఞానాన్ని ఛేదించేందుకు భారత్ శరవేగంగా 'రివర్స్ ఇంజనీరింగ్' చేస్తోంది. కాగా, భారత్ వద్ద ఉన్న ఈ చైనీస్ మిస్సైల్ రహస్యాలు, సాంకేతిక సమాచారం తెలుసుకునేందుకు జపాన్‌తో పాటు ఫ్రాన్స్ కూడా తీవ్ర ఆసక్తి కనబరుస్తుండటం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది (PL-15E Missile Reverse Engineering). PL-15E క్షిపణిలోని సీకర్ (Seeker), గైడెన్స్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు, కమ్యూనికేషన్ సిస్టమ్‌పై భారత శాస్త్రవేత్తలు...