రేపటి సీఎం ఎవరు? కేటీఆర్, లోకేష్‌ల వ్యూహాత్మక 'వెనకడుగు'!

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్, తెలుగుదేశం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఈ రెండు పార్టీలలోనూ తదుపరి తరం నాయకులుగా కేటీఆర్, నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో 'కాబోయే సీఎం'లుగా జోరుగా ప్రచారం పొందిన ఈ ఇద్దరు నాయకులు.. ప్రస్తుతం తాము సీఎం రేసులో లేమని, పార్టీల అధినేతల నాయకత్వంలోనే ముందుకు సాగుతామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష! తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే కేసీఆర్ ఇమేజ్, ఆయనకున్న ప్రజాకర్షణే ప్రధాన బలమని పార్టీ...