రష్యాతో అనుబంధం చారిత్రాత్మకం: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ

ముఖ్యమైన పాయింట్స్:పాశ్చాత్య దేశాల ప్రశ్నలకు ఘాటు స్పందన.. 1971 నాటి సోవియట్ మద్దతును గుర్తుచేసిన విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ: భారత్, రష్యాల మధ్య సంబంధాలు చారిత్రక అనుభవాల పునాదులపై నిర్మితమయ్యాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన Munich Security Conference వేదికగా ఆయన మాట్లాడుతూ, చరిత్ర మంచిదైనా.. చెడుదైనా ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. మాస్కోతో న్యూఢిల్లీ కొనసాగిస్తున్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న పాశ్చాత్య దేశాలకు ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 1950ల కాలం నుంచే సోవియట్ యూనియన్ (రష్యా) భారత్‌కు నిలకడైన మద్దతు అందించిందని జైశంకర్ గుర్తుచేశారు. ప్రపంచంలోని పలు దేశాలు పాకిస్థాన్ సైనిక పాలనకు మద్దతుగా నిలిచిన...