జలమండలికి భారీగా నిధులు: రూ.687.50 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు
ముఖ్యమైన పాయింట్స్:20 కేఎల్ ఉచిత నీటి పథకానికి రూ.75 కోట్లు.. సుంకిశాల ప్రాజెక్టుకు మరో రూ.250 కోట్ల విడుదల హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చేపట్టే వివిధ అభివృద్ధి పనులతో పాటు ఉచిత నీటి పథకానికి నిధులు కేటాయిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేస్తున్న 20 కిలోలీటర్ల ఉచిత నీటి సరఫరా పథకానికి (Free Water Scheme) సంబంధించి జలమండలికి ప్రభుత్వం రూ.75 కోట్ల పరిపాలనా...