మైదానంలో తప్పిన ప్రమాదం: తీవ్రంగా ఢీకొన్నా అద్భుత క్యాచ్‌తో మెరిసిన ప్రభ్‌సిమ్రాన్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ Yash Thakur వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆసీస్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి గాల్లోకి లేచి కవర్-పాయింట్ దిశగా వెళ్లింది. ఆ బంతిని అందుకునేందుకు వికెట్ కీపర్ Prabhsimran Singh వేగంగా పరుగెత్తుకొస్తూ కాల్ ఇచ్చాడు. అదే సమయంలో కవర్-పాయింట్ ఫీల్డర్ నిషాంత్ సింధు కూడా క్యాచ్ కోసం అంతే వేగంగా ముందుకు వచ్చాడు. ఒకరినొకరు గమనించకపోవడంతో ఇద్దరూ మైదానంలో అత్యంత బలంగా ఢీకొని కిందపడిపోయారు....