బిఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గుడ్‌‌బై: సన్నాహక సమావేశంలో తీవ్ర అవమానం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ (BRS Party) రాజకీయంలో తీవ్ర కలకలం రేగింది. పార్టీ సన్నాహక సమావేశంలో తనకు జరిగిన ఘోర అవమానానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్‌ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సన్నాహక సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో తన పేరును కనీసం ముద్రించకపోవడం, వేదికపైకి కూడా ఆహ్వానించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా అనంతరం తాటి వెంకటేశ్వర్లు 'దిశ' ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ తన ఆవేదనను, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉందని,...