తిరుచానూరులో కలకలం: పద్మావతి అమ్మవారి ఏనుగు 'శ్రీనిధి' దాడి.. తీవ్రగాయాలతో మావటికి ఐసియులో చికిత్స!
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. గత 18 ఏళ్లుగా అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న 'శ్రీనిధి' అనే ఆడ ఏనుగు తన మావటిపైనే దారుణంగా దాడికి తెగబడింది. ఆదివారం (అక్టోబర్ 4) రాత్రి ఊంజల్ సేవ ముగిసిన అనంతరం గోశాలకు తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన మావటి చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం Tirupati SVIMS Hospital కు తరలించగా, ఆయన పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సేవ ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో శ్రీనిధి హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న ఒకరిపై తొండంతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. గమనించిన మావటి చంద్రశేఖర్ వెంటనే...