తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్: ప్రారంభంకానున్న ట్రూ-అప్ ఛార్జీల బాదుడు!
హైదరాబాద్: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై మరోసారి అదనపు భారం పడనుంది. పవర్ పర్చేజ్, ఇంధన ధరలు మరియు నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో డిస్కంలు ప్రతిపాదించిన ట్రూ-అప్ ఛార్జీలకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) ఆమోదం తెలిపింది. అయితే, ఉచిత విద్యుత్ పొందుతున్న వ్యవసాయ పంపుసెట్ల వినియోగదారులకు ఈ భారం నుంచి ఊరట లభించింది. మిగిలిన గృహ, వాణిజ్య, పారిశ్రామిక, లిఫ్ట్ ఇరిగేషన్ వినియోగదారులపై త్వరలోనే ఈ అదనపు వసూళ్లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 2026 నుంచి యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ 2026 నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో సాధారణ గృహ వినియోగదారుల నెలవారీ...