పోక్సో కేసు ప్రచారంపై ఆంక్షలు కోరుతూ హైకోర్టుకు బండి సాయి భగీరథ్
ముఖ్యమైన పాయింట్స్:మీడియా, సోషల్ మీడియాపై స్టేకు పిటిషన్! హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికలు, టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు ప్రసారం చేయకుండా, ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన Telangana High Court Petition దాఖలు చేశారు. పోక్సో కేసుకు సంబంధించిన ఎలాంటి వివరాలు, ఆరోపణలు లేదా ఇతర కంటెంట్‌ను వివిధ మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని నిలువరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో కోరారు. ఈ వ్యవహారంలో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు ప్రధాన టీవీ...