అచ్చంపేట ట్రెజరీలో రూ.25 వేల లంచం: ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
నాగర్‌కర్నూల్: బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని Sub-Divisional Treasury Office లో సీనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కందాడ వెంకటయ్య రూ.25,000 లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాధితుడి మెడికల్ లీవ్, సంబంధిత బిల్లులు, అలవెన్సుల ఫైలును ప్రాసెస్ చేసేందుకు వెంకటయ్య ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ Nagarkurnool ACB Raid లో అధికారి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదుదారుడు ఆగస్టు 14న రూ.3,000 నగదు రూపంలో చెల్లించగా, మిగిలిన రూ.22,000 మొత్తాన్ని ఆగస్టు 18న ఫోన్‌పే...