ప్రపంచ శక్తిగా భారత్’: ప్రధాని మోదీపై సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిచ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ వేదికపై అత్యంత కీలక శక్తిగా అవతరించిందని సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిచ్ కొనియాడారు. ప్రభుత్వ అధినేతగా (గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా) 25 ఏళ్ల సుదీర్ఘ సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా PM Narendra Modi కి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఒక ప్రముఖ అంతర్జాతీయ పాడ్కాస్ట్లో మాట్లాడిన వుచిచ్.. మోదీ నాయకత్వ పటిమ, భారత్ సాధించిన పురోగతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సెర్బియా అధ్యక్షుడు మాట్లాడుతూ.. "నరేంద్ర మోదీ వంటి అత్యంత ప్రభావవంతమైన Global Leader ను బలహీనపరిచేందుకు ప్రస్తుతం కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. భారతదేశాన్ని అంతర్జాతీయంగా...