మున్సిపల్ పోరు వేళ కూటమిలో సీట్ల రగడ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీతో వేడెక్కిన రాజకీయం

అమరావతి: రాబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన కీలక భేటీలో రాబోయే Municipal Elections పై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసే స్థానాలపై రెండు పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు వ్యక్తమవుతున్నాయని Political Circles లో ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న జనసేన వర్గాలు.. ఈసారి మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలను పెద్ద సంఖ్యలో దక్కించుకోవాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. నామమాత్రపు స్థానాలతో సర్దుకుపోకుండా, టీడీపీకి పట్టున్న కీలక మున్సిపాలిటీలు,...