ఏపీలో స్థానిక పోరుకు వేళాయే!

ముఖ్యమైన పాయింట్స్:రేపే ఎస్‌ఈసీ కీలక భేటీ.. షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం! విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వేగంగా అడుగులు వేస్తోంది. క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ గురువారం విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో పాటు జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొననున్నారు. రాబోయే Local Body Elections నిర్వహణపై ఈ భేటీలో తుది సమీక్ష నిర్వహించనున్నారు. క్యాబినెట్ భేటీతో వాయిదా.. క్లారిటీతో రంగంలోకి! వాస్తవానికి ఈ సమావేశం బుధవారమే...